మాదారంలో విప్లవ వీరులు భగత్ సింగ్ కు ఘన నివాళి: కొవ్వొత్తుల ప్రదర్శన

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత పోరాటాల్లోకి రావాలి

మాదారంలో విప్లవ వీరులు భగత్ సింగ్ కు ఘన నివాళి: కొవ్వొత్తుల ప్రదర్శన

ఎన్ వి రాకేష్ పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు

 ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 26 :

భారత స్వాతంత్ర్య సంగ్రామ విప్లవ కెరటాలు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల 95వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాసంఘాలు పి వై ఎల్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సింగరేణి మండలం మాదారం గ్రామంలో కొవ్వొత్తులతో భగత్ సింగ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పి.వై.ఎల్ (పీ వై ఎల్ ) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి. రాకేష్ ఏఐయూకేఎస్ డివిజన్ కార్యదర్శి గుగులోతు తేజ నాయక్ అరుణోదయ జిల్లా నాయకులు వేములపల్లి వీరన్న లు మాట్లాడుతూ...దేశ విముక్తి కోసం అతి చిన్న వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాలు అజరామరమని కొనియాడారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నేటి యువత వారి ఆశయాలను అందిపుచ్చుకొని, ప్రజా సమస్యల పరిష్కారానికి విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, దోపిడీ లేని సమాజం కోసం పోరాడటమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ నాయకులు కోయిల ఉమామహేష్ , కుమ్మరికుంట్ల నరేష్ , కల్తి లక్ష్మీనారాయణ , తాటి కృష్ణ , వేములపల్లి రమేష్ , తిరుమలగిరి ప్రసాదు , పూనం శ్రీను , ఈసం రాంబాబు , కోయిల వెంకన్న , సేవగాని నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం, విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం,
  ( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.
ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి నీడ - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 
రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన