నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టిన పుర చైర్ పర్సన్ కొండా శ్వేత 

అందరి సహకారంతో అభివృద్ధి చేస్తా

నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టిన పుర చైర్ పర్సన్ కొండా శ్వేత 

పాల్గొన్న ప్రముఖులు...ఘన సన్మానం 

నారాయణపేట మార్చి 25:

నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్ బుధవారం నిరాడంబరంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఉదయం తన ఛాంబర్ లో పేద పండితులనే పూజ లు,యజ్ఞంనిర్వహించారు.అనంతరం మున్సిపల్ కార్యాల యంలో వెలసిన అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజ లునిర్వహించారు.ఆతరువాత పండితుల దీవెనలతో చైర్ పర్సన్ సీటు లో ఆసీనుల య్యారు.మున్సిపల్ కమిష నర్ నర్సయ్య రిజిస్టర్ ఇవ్వ గా కొండా శ్వేత సత్యయా దవ్ సంతకం చేసి బాధ్యత లు స్వీకరించారు.ఈ సంద ర్భంగా కమిషనర్ నర్సయ్య మున్సిపల్ సిబ్బంది చైర్ పర్సన్ కొండా శ్వేత సత్య యాదవ్ ,వైఎస్ చైర్ పర్సన్ మంజుల జి ఆర్ రెడ్డి లను గజమాలతో శాలువాలతో పూల బోకెలతో ఘనంగాస న్మానించారు.అలాగే వివిధ పార్టీలనాయకులు,అభిమానులు శాలువాలతో పెద్ద ఎత్తున సన్మానించి శుభాకాం క్షలు తెలిపారు.అనంతరం చైర్ పర్సన్ కొండా శ్వేత సత్యయాదవ్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ఎంపీ డి కే అరుణ,ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి,వివిధ పార్టీల నాయ కులు,మున్సిపల్ కౌన్సిలర్ల అందరి సహకారంతో కృషి చేస్తానని అన్నారు.అందరూ సహకరించాలనికోరారు.అనంతరం మున్సిపల్ కౌన్సిల ర్లను అందరినీ చైర్ పర్సన్ శాలువాలతో సన్మానించి ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోతో కూడిన మెమంటో లనుబహుకరించారు.ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే.రతంగ్ పాండు రెడ్డి,బిజెపి జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్,కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కే.శివకుమార్ రెడ్డి,బిజెపి,బి ఆర్ ఎస్,కాంగ్రెస్,ఎం ఐ ఎం నాయకులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:2.బాధ్యతలు స్వీకరిస్తున్న చైర్ పర్సన్ కొండా శ్వేత,3.సన్మానిస్తున్న మున్సిపల్ అధికారులు,4.సన్మానిస్తున్న పార్టీ నాయకులు 
_____________________

Tags:

About The Author

Latest News

విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం, విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం,
  ( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.
ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి నీడ - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 
రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన