సర్పంచ్‌ల శిక్షణలో అదనపు కలెక్టర్ మార్గదర్శనం –

మానవ అభివృద్ధికి ప్రాధాన్యం

సర్పంచ్‌ల శిక్షణలో అదనపు కలెక్టర్ మార్గదర్శనం –

సిద్దిపేట జిల్లా ప్రతినిధి మార్చి18:(లోకల్ గైడ్ తెలంగాణ) 

మందపల్లిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) జిల్లా పంచాయతీ అధికారితో కలిసి సందర్శించి మార్గదర్శకాలు అందించారు.గ్రామ అభివృద్ధి కేవలం మౌలిక వసతులకే పరిమితం కాకుండా, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, త్రాగునీటి వంటి మానవ అభివృద్ధి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ సభల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని తెలిపారు.మహిళా సర్పంచ్‌లు రిజర్వేషన్ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి గ్రామ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
గ్రామాల్లో మద్యపానం, మాదకద్రవ్యాల నిర్మూలనతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్‌ల కోసం ఏర్పాటు చేసిన “గ్రామ జీవన చక్రం” ఎగ్జిబిషన్‌ను కూడా పరిశీలించారు.

Tags:

About The Author

Latest News

రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ
సిద్దిపేట జిల్లా ప్రతినిధి మార్చి18(లోకల్ గైడ్ తెలంగాణ):నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మితమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు రైతు మేళా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె....
సర్పంచ్‌ల శిక్షణలో అదనపు కలెక్టర్ మార్గదర్శనం –
నవోదయ ఫలితాల్లో మెరిసిన చైతన్య విశ్వభారతి స్కూల్ విద్యార్థి 
కారేపల్లి మంటిసోరి స్కూల్ లో ఉగాది సంబరలు ఘనంగా 
ఘనంగా భోసి పాఠశాలలో ఉగాది సంబరాలు. 
15వ వార్డులో రంజాన్ కానుకలు పంపిణీ...
రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక