కారేపల్లి మంటిసోరి స్కూల్ లో ఉగాది సంబరలు ఘనంగా 

స్కూల్ ప్రిన్సిపాల్ మీనీ జోజో 

కారేపల్లి మంటిసోరి స్కూల్ లో ఉగాది సంబరలు ఘనంగా 

ఖమ్మం జిల్లా, కారేపల్లి :లోకల్ గైడ్, మార్చి  18 :

కారేపల్లి మండల కేంద్రంలోని మంటిసోరి స్కూల్ లో ఉగాది సంబరలు పిల్లలాల కేరితాలతో, పంచ్చని మావిడాకుల తోరణాలతో అంబరాన్ని అంటిన్నాయి. ఈ సందర్బంగా స్కూల్ ప్రిన్సిపాల్ మీనీ జో జో  ఉగాది విశిష్టతను పిల్లలకు వివరణ ఇస్తూ  మాట్లాడుతూ ఇది తెలుగు వారి నూతన సంవత్సరం . చైత్ర శుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్మకం. వసంత రుతువు ప్రారంభంలో, ప్రకృతి కొత్త చిగుర్లతో పచ్చదనంతో ఉట్టిపడుతుండగా, షడ్రుచుల పచ్చడితో ఈ పండుగను జరుపుకుంటారు, ఇది జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని సూచిస్తుంది అనీ ఉగాది విశిష్టతాను తెలిపినారు . అలాగే 
ఉగాది పచ్చడి (షడ్రుచులు): ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని వివిధ అనుభవాలను ప్రతిబింబిస్తాయి.
వేపపువ్వు (చేదు): బాధ్యతలు, కష్టాలు.
బెల్లం (తీపి): సంతోషం.
చింతపండు (పులుపు): సవాళ్లు, వికారం.
ఉప్పు (ఉప్పదనం): ఆసక్తి, జీవన రుచి.
కారం: కోపం, అసహనం.
మామిడికాయ (వగరు): కొత్త ఆశలు, కొత్త పనులు.
ఆచారాలు: ఇళ్లను శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు ధరించడం, పచ్చడి ఆస్వాదించడం, మరియు పంచాంగ శ్రవణం (వచ్చే ఏడాది ఫలితాలు వినడం) ఈ పండుగలో ప్రధాన భాగాలు.
ప్రకృతి పండుగ: ఇది రైతులు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభించే సమయం, దీనిని 'ఏరువాక' అని కూడా పిలుస్తారు అన్నారు. ఈ సందర్బంగా స్కూల్ పిల్లలతో ఉగాది పచ్చడి తినిపించి, వివిధ సంస్కృతికా  నృత్యలను విద్యార్థునులతో ప్రదర్శిపాజేసినారు. ఈ కార్యక్రమం స్కూల్ అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ
సిద్దిపేట జిల్లా ప్రతినిధి మార్చి18(లోకల్ గైడ్ తెలంగాణ):నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మితమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు రైతు మేళా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె....
సర్పంచ్‌ల శిక్షణలో అదనపు కలెక్టర్ మార్గదర్శనం –
నవోదయ ఫలితాల్లో మెరిసిన చైతన్య విశ్వభారతి స్కూల్ విద్యార్థి 
కారేపల్లి మంటిసోరి స్కూల్ లో ఉగాది సంబరలు ఘనంగా 
ఘనంగా భోసి పాఠశాలలో ఉగాది సంబరాలు. 
15వ వార్డులో రంజాన్ కానుకలు పంపిణీ...
రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక