15వ వార్డులో రంజాన్ కానుకలు పంపిణీ...
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముస్లింల పవిత్ర రంజాన్ పురస్కరించుకొని
బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 15వ వార్డు టేకులబస్తిలో వార్డు కౌన్సిలర్ చింతల వసంత స్థానిక ముస్లింలకు రంజాన్ పండుగ కానుకలు బుధవారం పంపిణీ చేశారు.బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముస్లింల పవిత్ర రంజాన్ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సరఫరా చేస్తున్నటువంటి ఈద్ ముబారక్ కానుకలను అందజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతు ముస్లిం కులస్తుల పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఎంతో పవిత్రతో కఠినంగా ఉపవాస రోజును కొనసాగిస్తు నెలరోజుల తర్వాత ఎంతో ఘనంగా రంజాన్ పండుగను జరుపుకుంటారని,వారు సంపాదించే దానిలో 10శాతం పేదవారి కోసం సహాయం చేయాలని ఒక సంకల్పంతో ముస్లిం కుటుంబాలు అందరు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తుండడం హర్షణీయం అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇస్తున్న కానుకలను ప్రతి ముస్లిం పేద కుటుంబాలకు అందజేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.బెల్లంపల్లి ఎమ్మెల్యే పూర్తి సహాయ సహకారాలతో కానుకలు సకాలంలో ముస్లిం కుటుంబాలకు అందేవిధంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న కానుకల ద్వారా
ముస్లింలు అందరు పవిత్ర రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సోషల్ మీడియా మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్ దేవసాని ఆనంద్,వార్డు ఇంచార్జి కన్నూరి వెంకటేష్,నాయకులు దెబ్బెటి రమేష్,ఎస్ కె గౌస్,కన్నూరి రాజలింగు,నక్క శంకర్,బొల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.
