ఘనంగా భోసి పాఠశాలలో ఉగాది సంబరాలు.
ఉగాది పచ్చడి చేసి పంచిన విద్యార్థులు
ఉగాది విశిష్టతను ప్రాముఖ్యతను తెలియజేసిన ఉపాద్యాయులు.
నిర్మల్ :లోకల్ గైడ్:
గత ఉగాది విశ్వావసునామ సంవత్సరముకు బాయ్ బాయ్ చెప్పి నూతన ఉగాది పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం తెలుపుతూ
తానూర్ మండలంలోని భోసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు సంవత్సరాది సందర్భంగా ముందస్తుగా ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.
విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా సంప్రదాయబద్ధంగా ప్రకృతిలో లభించే షడ్రుచులు (వగరుకై)మామిడికాయ చేదుకై వేప పూత పులుపు కోరకు చింతపండు కారం ఉప్పు బెల్లం సేకరించి ఉగాది పచ్చడి తయారు చేశారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి సహ ఉపాధ్యాయులు సంజయ్ రావు,గణేష్ లు మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ల గురించి సంక్షిప్తంగా విద్యార్థులకు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ఉగాది నుండి ప్రకృతిలో జరిగే ఎన్నో రకాల మార్పుల గురించి తెలియజేస్తూ
ఉగాది సమయం నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుందని. ఈ సమయంలో ప్రకృతిలో అనేక అందమైన మార్పులు కనిపిస్తాయని, కొత్త ఆకులు మొలకెత్తడం,పూల వికాసం:పక్షుల కిలకిలారావం,పంటల పెరుగుదల,ఉష్ణోగ్రత పెరగడం, సువాసనైన గాలులు,పూల సువాసనతో గాలి తీయగా అనిపిస్తుందని వివరిస్తూ ఈ మార్పులు ఉగాది పండుగతో కొత్త ఆరంభాన్ని, ప్రకృతి పునరుజ్జీవాన్ని సూచిస్తాయని తెలియజేశారు. మన భారతదేశంలో చాలామంది ఆంగ్ల సంవత్సరమును జనవరిని కొత్త సంవత్సరమన మనీ మురిసిపోతుంటారని అది కరెక్ట్ కాదని తెలిపారు నిజమైన నూతన సంవత్సరం అంటే ఉగాది అని గుర్తు చేశారు ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల ప్రాముఖ్యతను వారు వివరిస్తూ,జీవితం లోని సుఖదుఃఖాలను సూచిస్తాయని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఉగాది పండుగ విశిష్టత, తెలుగు సంవత్సరాది ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. మన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు తోటి విద్యార్థులతో సహా ఉపాధ్యాయులను సైతం ఉగాది పచ్చడిని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి సహఉపాధ్యాయులు సంజయ్ రావు, వందన,సుధాకర్, గంగాధర్, దూర్పత్ రెడ్డి,శ్రీధర్ (పి.డి.),గణేష్, శ్రీదేవి, సంగీత,నీల, నవీన్ కుమార్, రవి, శంకర్ లు విద్యార్థులు పాల్గొన్నారు
