వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ
రూ.53.80 లక్షల విలువైన యంత్రాలు అందజేసిన:మంత్రి
By Ram Reddy
On

సిద్దిపేట జిల్లా ప్రతినిధి నరేష్ (లోకల్ గైడ్ తెలంగాణ)
బుధవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రికీకరణ పథకం కింద అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాలకు చెందిన 38 మంది రైతులకు రూ.53 లక్షల 80 వేల విలువైన వ్యవసాయ పరికరాలను మంత్రివర్యులు పంపిణీ చేశారు. ఇందులో 36 రోటోవేటర్లు, 2 స్ట్రాబెలర్లు (గడ్డిని కట్టకట్టే యంత్రాలు) రైతులకు 50 శాతం సబ్సిడీపై అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల శ్రమను తగ్గించి అధిక దిగుబడులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రికీకరణ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. రైతులు ఈ పథకాన్ని వినియోగించుకుని ఆధునిక వ్యవసాయ పరికరాలను పొందాలని సూచించారు.
ఈనెల 22న నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా మూడు రోజుల పాటు రైతు మేళా నిర్వహించి వ్యవసాయ పనిముట్ల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.ఇంకా రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్ల నేపథ్యంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించనున్నట్లు తెలిపారు. గతంలో రైతులకు అందని చిన్న చిన్న వ్యవసాయ పరికరాలను ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ కింద మరిన్ని వ్యవసాయ పరికరాలను అందించే అవకాశం ఉందని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు రైతులను వ్యవసాయ యాంత్రికీకరణ పథకం ద్వారా పరికరాలు పొందేందుకు ప్రోత్సహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయబడినది.
Tags:
About The Author
Latest News
11 Mar 2026 14:02:31
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మార్చి 11. (లోకల్ గైడ్)
హైదరాబాద్లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కిక్కర్స్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి
