మంత్రి కోమటిరెడ్డి గారిని కలిసిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు

తెలిపిన 11వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్.

మంత్రి కోమటిరెడ్డి గారిని కలిసిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. (లోకల్ గైడ్).


నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ నుంచి గెలుపొందిన పాలకూరి సుమలత సంతోష్ ఈరోజు రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.మహాశివరాత్రి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  నల్లగొండలోని పచ్చల సోమేశ్వరాలయానికి రాగా రైస్ మిల్ అసోసియేషన్ నాయకులు జూలకంటి ఇంద్రారెడ్డి, ఇటీవల 11 డివిజన్ నుంచి గెలుపొందిన పాలకూరి సుమలత సంతోష్ మంత్రిని కలిశారు .సోమవారం జరిగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వారు మంత్రికి తెలిపారు .వార్డు అభివృద్ధికి కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు .మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు .కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం పట్ల ఈ సందర్భంగా కార్పొరేటర్ ను ను మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జూలకంటి ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News