యాసంగి వరి ధాన్యం కొనుగోలు కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.



నిర్మల్  : లోకల్ గైడ్ : 
జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. 
   శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో యాసంగి (రబీ) వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సమావేశం నిర్వహించారు. 
   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నిర్ణీత సమయానికి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించి,  గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సంబంధించి తగిన ఏర్పాట్లను తక్షణమే పూర్తిచేయాలని పేర్కొన్నారు. ధాన్యాన్ని అమ్మేందుకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద టెంటు, త్రాగునీరు, తదితర వసతులు కల్పించాలని వివరించారు. ఎక్కడ కూడా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తగినన్ని ధాన్యపు సంచులు, తూకపు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
     ఈ సమావేశంలో జిల్లా సరఫరాల శాఖ అధికారి రాజేందర్, పౌరసరఫరాల మేనేజరు సుధాకర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి 
ప్రజల భద్రత కొరకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్...
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యుల రికార్డు  - 346 కిడ్నీ మార్పిడి చికిత్సలతో రికార్డు సృష్టించిన ఆసుపత్రి వైద్యులు 
సమ్మె చేస్తున్న ఆర్టిసన్స్ ను చర్చలకు పిలవాలి.
ఉన్నత విద్య నేటి తరాలకు అందించవలసిన అవసరం అధ్యాపకులపై ఉన్నది.
పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు – ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్