బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం...

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య,బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్,బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,మున్సిపల్ కమిషనర్ సంపత్,చైర్ పర్సన్ దావ స్వాతి,వైస్ చైర్ పర్సన్ సత్యనారాయణ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు.మున్సిపల్ పరిధిలో వివిధ విభాగాలలో పని చేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందించాలని,ఈ మేరకు మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను,ఇతర పన్నులను100శాతం వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించేందుకు డి ఎం ఎఫ్ టి నిధుల నుండి ఆటోలు అందించినట్లు తెలిపారు.బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల నుండి 2కోట్ల 50లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అంతర్గత రహదారులు,మురుగు కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.విద్యుత్ బిల్లులు తగ్గించే ఆలోచనలో భాగంగా సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో నిరంతరం త్రాగునీటిని సరఫరా చేసేందుకు పనులు కొనసాగుతున్నాయని,ముల్కల్ల నుండి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని,అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని వార్డులలో సిబ్బంది కొరత ఉన్నట్లయితే  సమకూర్చుకునేందుకు పాలకవర్గం సమన్వయంతో చర్యలు తీసుకోవచ్చని,ప్లాస్టిక్ వ్యర్ధాలను నిబంధనల ప్రకారం విక్రయించి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చనున్నట్లు తెలిపారు.మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో షాపులు తీసుకున్న వారి వద్ద నుండి అద్దె క్రమం తప్పకుండా వసూలు చేయాలని,ఖర్చులు తగ్గించి ఆదాయం పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.2026-27 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ 32కోట్ల 42లక్షల రూపాయల అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారని,ఇందులో 4కోట్ల 77లక్షల రూపాయలు సాధారణ ఆదాయం (గ్రాంట్లు కాకుండా),26కోట్ల 28లక్షల రూపాయల గ్రాంట్లు,81లక్షల రూపాయల డిపాజిట్లు,అడ్వాన్సులు,55లక్షల రూపాయల నిలువ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతు బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34వార్డులలో ఒక సంవత్సర కాలంలో మురికివాడలను పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా అందరి సమన్వయంతో చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.మున్సిపల్ అభివృద్ధి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని,మున్సిపల్ పరిధిలోని పారిశుద్ధ్యం,ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ,ప్రజా సమస్యల పరిష్కారంపై పాలకవర్గ సభ్యులు జవాబుదారీ తనంతో వ్యవహరించాలని తెలిపారు.మున్సిపల్ పరిధిలోని అన్ని రంగాలను అభివృద్ధి చేసే విధంగా బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలిపారు.ఆయా కేటాయింపుల ప్రకారంగా నిధులను వినియోగించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని అర్హత గల ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డుల కౌన్సిలర్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం– 152 సీసీ కెమెరాల ఏర్పాటు సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం– 152 సీసీ కెమెరాల ఏర్పాటు
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి26:ప్రజల భద్రత మరియు నేర నియంత్రణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో...
పశుపోషణలలో రైతులకు మెళకువలు ఎంతో అవసరం
పెట్రోల్ డీజిల్ కొరతతో కుదేలు కానున్న వ్యవసాయ రంగం.
కామారెడ్డి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ  డైరీ
హనుమత్ సంకల్ప మహా శోభ యాత్ర..
యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి.
బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం...