న్యాయవాదుల పరిరక్షణ చట్టం పట్ల బార్ అసోసి యేషన్ హర్షం
By Ram Reddy
On
నారాయణపేట ఏప్రిల్ 1 :
గత కొన్నేళ్లుగా న్యాయవాదులు న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక,గుజరాత్ రాష్ట్రాల్లో అమలవుతున్న అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఒక మంచి సంకల్పంతో ఆదివారం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ద్వారా అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం బిల్లును చట్టముగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈబిల్లు వలన కేవలం అడ్వకేట్ మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు రక్షణ ఆస్తుల పరిరక్షణ కూడా కల్పిస్తూ చట్టం రూపకల్పన చేయడం యావత్ తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్ ప్రయోజనం కలుగనుందని అన్నారు.చట్టం తీసుకురావడానికి సహకరించిన ముఖ్యమంత్రి,మంత్రులు,అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులుపాల్గొన్నారు.ఫోటో రైట్ అప్:1.స్వీట్లు పంచుకున్న న్యాయవాదులు
________________________
Tags:
