నిర్మలమ్మ బడ్జెట్ సామాన్యులకు సౌభాగ్యం.

నిర్మలమ్మ బడ్జెట్ సామాన్యులకు సౌభాగ్యం

నిర్మలమ్మ బడ్జెట్ సామాన్యులకు సౌభాగ్యం.

కేంద్ర ప్రభుత్వ న్యాయ వాది రఘువీర్ యాదవ్ .

నారాయణపేట ఫిబ్రవరి 1:

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు సౌభాగ్యం వంటిదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ పేర్కొన్నా రు.నిర్మలమ్మ  ప్రతిపాదించిన బడ్జెట్ వల్ల మధ్యతరగతి మహా జనానికి మరింతగా అవకాశాలు అన్ని విధాల పెరగబోతున్నాయన్నారు. విద్యుత్ వాహనాలు  సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు తగ్గబోతున్నాయనీ, ఆదాయం పన్ను కట్టేవారికి  బాధలు తగ్గుతాయన్నారు. ఒక వారం కింద జరిగిన ''భారత్- ఈ యు ఒప్పందం" వల్ల అనేక అవకాశాలు ఈ బడ్జెట్లో కనబడబోతు న్నాయి అన్నారు. మొత్తం మీద ఇది భారతీయులకు బాధలు భారం వేయకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారా మన్  తన తొమ్మిదవ బడ్జెట్ను ప్రతిపాదించడం చాలా సంతోషకరం అన్నారు. ఇటు రైల్వే లైన్ లో హై స్పీడ్ రైలు హైదరాబాద్ టు బొంబే హైదరాబాద్ టు చెన్నై వార ణాసి టు బొంబాయి బొంబా యి టు హైదరాబాద్ ముంబై టు సిలిగురి మధ్య మూడు హైస్పీడ్ రైలను ప్రవేశపెట్టడం హర్షణీయం అన్నారు. ఈ బడ్జెట్ వికసిత భారత్  లక్ష్యా నికి అనుగుణంగా దోహదప డబోతోందని తెలిపారు
ఫోటో రైట్ అప్:3.రఘువీర్ యాదవ్ 
______________________

Tags:

About The Author

Latest News