ఖమ్మం కార్పొరేషన్
అభివృద్ధే మా లక్ష్యం… ప్రజల సౌకర్యమే మా ప్రాధాన్యం
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
ఖమ్మం :లోకల్ గైడ్ :
నగరంలోని 35వ డివిజన్‌లో వాసవి కళ్యాణ మండపం ఎదురుగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ గారు శంకుస్థాపన చేశారు.
మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సుమారు రూ.11 లక్షల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు పూర్తయ్యే సరికి స్థానికులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే తమ లక్ష్యమని, ప్రతి డివిజన్‌లో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు బాలగంగాధర్ తిలక్, వెండి బంగారం అసోసియేషన్ అధ్యక్షులు బందు సూర్యం, నకిరికంటి రాధాకృష్ణ, సతీష్, కార్యదర్శి గడ్డం శ్రీనివాసరావు, కుంకిమళ్ళ వేణుగోపాల్, రచ్చ శ్రీనివాసరావు, ఎడంకంటి రామారావు, సుంకరి వెంకటేశ్వర్లు, దినేష్ నాయుడు, డి.ఈ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
