పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
పఠాన్ చేరు నియోజకవర్గంలోని అమీన్పూర్ పట్టణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డాక్టర్ సి. అంజి రెడ్డి వారి సతీమణి, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి స్థానిక శంభు లింగేశ్వర ఆలయం, లక్ష్మీ గణపతి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సి.అంజి రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాల తో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని పరమేశ్వరుని ప్రార్థించినట్లు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం ప్రతి కుటుంబానికి ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. అలాగే, ఈ పవిత్రమైన రోజున రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరమేశ్వరుని కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై ఉండాలని హృదయ పూర్వకంగా కోరుకున్నారు. ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని, సనాతన సంస్కృతిని కాపాడుతూ ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభ్యున్నతే తమ సంకల్పమని పేర్కొన్నారు. భక్తి మార్గంలో ప్రజలతో కలిసి నడుస్తూ సేవే తన ధ్యేయమని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త భాస్కర్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.