హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న బీజేపీ శేరిలింగంపల్లి..

ఇంఛార్జి రవికుమార్ యాదవ్

హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న బీజేపీ శేరిలింగంపల్లి..

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ మసీద్ బండ కార్యాలయంలో హోలీ సంబరాలను. ఈ కార్యక్రమంలో మియాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్ల నాయకులు, మసీద్ బండ గ్రామ మహిళలు, జిహెచ్ఎంసి కార్మికులు పాల్గొని రంగులు చల్లి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ..వసంత ఋతువుకు స్వాగతం పలికే రంగుల పండుగే హోలీ అని తెలిపారు. చెడుపై మంచికి సంకేతంగా నిలిచే ఈ పండుగ సమతా, మమతలకు ప్రతీకమని అన్నారు. పేద-పెద్ద తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఆనందాలు పంచుకునే పండుగ హోలీ అని పేర్కొన్నారు. ఈ హోలీ పండుగ తెలంగాణ రాష్ట్రం, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరి జీవితాలlo సుఖశాంతులు, ఐశ్వర్యం, సంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమణయ్య, సత్యనారాయణ రాజు, గుండె గణేష్ ముదిరాజ్, విష్ణుదత్, రాజు ముదిరాజ్, దేవేందర్ రావు, శ్రీను, శ్రీనివాస్ యాదవ్, రాము, అమర్నాథ్ రెడ్డి, కమలేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సిద్ధిపేట జిల్లా ప్రతినిధి మార్చి15(లోకల్ గైడ్ తెలంగాణ)  ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని మైత్రి వనంలో గల వెనుకబడిన అభివృద్ధి శాఖ మరియు షెడ్యూల్ కులాల అభివృద్ధి...
సింగరేణి మండలం సర్పంచ్ లా ఫోరం అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం 
శిక్షణ ను సద్వినియోగం చేసుకొని జనగణన పకడ్బందీగా
మెట్ల దారిన.. మొక్కుల దేవుని చెంతకు! శ్రీనివాసగిరిపై భక్తి పారవశ్యం.. భక్తులతో కలిసి నడిచిన మంత్రి పొంగులేటి
యరసానిగూడెం గ్రామంలో ఉచిత చెవి–ముక్కు–గొంతు వైద్య శిబిరం.
ఘనంగా గంగమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవం.
చలివేంద్రం ప్రారంభించిన సారపాక సర్పంచ్ ఉపసర్పంచ్