దుబ్బతండ పంచాయతీలో ఉపాధి హామీ పనులు ప్రారంభం  -సర్పంచ్ మత్రు నాయక్ 

దుబ్బతండ పంచాయతీలో ఉపాధి హామీ పనులు ప్రారంభం   -సర్పంచ్ మత్రు నాయక్ 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 2 :

సింగరేణి మండల  పరిధిలోని  దుబ్బతండ గ్రామ పంచాయతీలో  ఉపాధి హామీ  పనులు  సోమవారం ఘనంగా  ప్రారంభించడం జరిగింది. గ్రామ  సర్పంచ్  ఆంగోత్  మత్రు  పార  పట్టి పనులను  ప్రారంభించీ   మాట్లాడుతూ, గ్రామంలోని అర్హులైన  ప్రతి  కూలీకి  ఉపాధి కల్పించడమే  తమ  ముఖ్య లక్ష్యమని  తెలిపారు.  గ్రామ అభివృద్ధికి  ఉపాధి  హామీ  పథకం  ఎంతో   దోహదపడుతుందని,  కూలీలు ప్రభుత్వం  కల్పించిన  ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకొని  తమ  కుటుంబాల ఆర్థిక  స్థితిని  మెరుగుపరచుకోవాలని  కోరారు.
గ్రామంలో  రహదారుల మరమ్మత్తులు,  చెరువుల శుభ్రత,  కాలువల  నిర్మాణం, చెట్లు  నాటడం  వంటి  అభివృద్ధి పనులను  చేపట్టనున్నట్లు   తెలిపారు. ఈ  పనులు  గ్రామ అభివృద్ధికి  తోడ్పడటంతో  పాటు పర్యావరణ  పరిరక్షణకు  కూడా ఉపయోగపడతాయని  చెప్పారు.
వేసవి  తీవ్రత  దృష్ట్యా  పని ప్రదేశాల్లో  తాగునీరు,  నీడ, ప్రథమ  చికిత్స  వంటి సౌకర్యాలు  తప్పనిసరిగా ఉండేలా  చూడాలని అధికారులను  అదేశించీనాడు. కూలీలకు  సమయానికి   వేతనాలు  చెల్లించేలా  చర్యలు తీసుకోవాలని  సూచించారు.
పనులు నాణ్యతతో, పారదర్శకంగా పూర్తి చేయాలని, గ్రామ ప్రజలందరూ కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్‌లో ఖమ్మం ఎంపీకి చోటు అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్‌లో ఖమ్మం ఎంపీకి చోటు
  ఖమ్మం:( లోకల్ గైడ్)   పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్–స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యుడిగా
మాదారం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం 
ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం
మున్సిపాలిటీ కో-ఆప్షన్ రేసులో బండారు మహేష్?
అశ్వారావుపేటలో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు?
నూతన వధువరులకు శుభాకాంక్షలు 
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి..