బాల్య వివాహాలపై  వ్యాసరచన పోటీ.

బేటీ బచావో బేటి పడావో*కార్యక్రమం నిర్వహించడం

బాల్య వివాహాలపై  వ్యాసరచన పోటీ.

 

 మిర్యాలగూడ మార్చి 18
 (లోకల్ గైడ్ తెలంగాణ)

ఐసిడిఎస్  మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని బండమీదిగూడెం  సెక్టార్ లో గల జడ్.పి.హెచ్.ఎస్   తడకమళ్ళ
మిర్యాలగూడ నందు సిడిపిఓ రేఖల మమత మేడం ఆదేశాల మేరకు బుధవారం
బేటీ బచావో బేటి పడావో*కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా  బాల్యవివాహాల పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు .పోటీలో ప్రతిభ కనబరిచిన బాలికలకు ప్రథమ, ద్వితీయ, బహుమతులను సర్పంచ్ గారు మేక, సైదులు గారు అందజేశారు మరియు కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్  వి.హేమదేవి మాట్లాడుతూ.ఆడపిల్లల కు 18 సంవత్సరాల  వయసు నిండకుండా మగపిల్లలకు21 సంవత్సరాలు నిండకుండా చేసే వివాహం బాల్యవివాహం అని అనేక కారణాల వలన ఈ బాల్యవివాహాలు చేస్తున్నారు  తల్లిదండ్రుల కు పిల్లల పైఅభద్రతా భావం, వరకట్నం కారణంగా కట్నం తీసుకొనకుండా పెళ్ళిచేసుకునే మంచి పెళ్ళి సంబంధం వచ్చింది అని ఈ విధమైనకారణాల వలన పెళ్ళిళ్లు  చేయుటకు సిద్ధపడుతున్నారు.బాల్యవివాహాల వలన అనేక నష్టాలు ఉన్నాయి భవిష్యత్తు లో బాలికల ఆరోగ్యాని తీవ్రంగా దెబ్బతీస్తాయి.చిన్నవయసులోనే గర్భాధారణ, మాతృ శిశుమరణాలకు దారితీస్తుంది,ఆరోగ్యసమస్యలు మానసిక ఒత్తిడి కుటుంబహింసకు దారితీస్తుంది కనుక బాల్యవివాహ నిరోధ చట్టం 2006 ను సమాజం లోకి తీసుకువెళ్లాలని అయితే బాలికలు చక్కగా చదువులో మంచి ప్రతిభను కనబరచాలని తల్లితండ్రులలో  తమ పిల్లలపై అభద్రత భావం తగ్గించేలా ఆడపిల్లలు ఉండాలని సోషల్ మీడియావలనఆడపిల్లలు ఎన్నో మోసాలకు గురి అవుతున్నరూ దీనికి కారణం తెలిసి తెలియని వయస్సులో అవతలి వ్యక్తి చెప్పే మాయమాటలను నమ్మి లొంగిపోవడం  జరుగుతుంది. ఇలాంటి క్రైమ్స్ కు
ఆడపిల్లలు దూరంగ ఉండాలని ఎవరైనా తెలియని వ్యక్తి మీ వివరాలు అడిగినట్లయితే వారికీ ఎటువంటి వివరాలు ఇవ్వకుండా 100 కు కాల్ చేయాలనీ ఆడపిల్లల్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత, అలాగే ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది. ఆడపిల్లలకి ఎలాంటి ఆపద వచ్చినా అక్కున చేర్చుకోవడానికి బాలసదనాలు ఉన్నాయి. ఆడపిల్లలు వద్దు అనుకున్న వాళ్లు ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటుచేసిన ఉయ్యాలలో వేయగలరు అంతేగాని అక్రమ దత్తత ఇవ్వకూడదు అని తెలియజేయడం జరిగింది.  టోల్ ఫ్రీ నెంబర్లు  1098  , 100 లకు కాల్ చేసి తెలియపరచాలని సురక్షితమైన స్పర్శ& అసురక్షితమైన స్పర్శ ను గురించి ఆడపిల్లల చదువు గురించి, ఆడపిల్లల భద్రత గురించి, అక్రమ దత్తత గురించి ,పిల్లలు డ్రాప్ ఔట్ కాకుండా, అందరూ చదువుకోవాలి  అందరూ చదువుకొనేల చూడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  
సూపర్వైజర్ : వి. హేమదేవి 
 జడ్.పి.హెచ్.ఎస్  తడకమల్ల: ఇంచార్జీ హెడ్ మాస్టర్ అంకిరెడ్డి,                       
 టీచర్స్ శ్రీనివాసరెడ్డి, కవిత , శోభారాణి స్కూల్ స్టాఫ్ 
అంగన్వాడీ టీచర్స్  మెహరనిస ,అభేద అంతమ్మ, మాధవి స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, మార్చి -18:లోకల్ గైడ్ :----------------------------196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్...
వందేమాతరాన్ని అవమా మించిన మజ్లిస్ ఎమ్మెల్యే లను
ప్రధాని ఖేల్ సంసద్ క్రీడలను విజయవంతం చేయాలి:బి జె వి ఎం అద్యక్షుడు మణిశంకర్
ఆలయాల్లో అమావాస్య శోభ...అన్నదానాలు
మక్తల్ నియోజక వర్గం గ్రాముల రోడ్లకు మహర్దశ
బాల్య వివాహాలపై  వ్యాసరచన పోటీ.
భూస్వామ్య కుటుంబంలో పుట్టినా.