హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన..అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్
ఆనందంగా, ఐశ్వర్యాలతో జీవిస్తూ దేశ సార్వభౌమత్వం, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.
By Ram Reddy
On
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆనందంగా, ఐశ్వర్యాలతో జీవిస్తూ దేశ సార్వభౌమత్వం, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెమికల్స్‌తో తయారైన రంగులు కాకుండా సహజ రంగులతో హోలీ పండుగను జరుపు కోవాలని, పర్యావరణాన్ని కాపాడుతూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్నేహభావంతో, ఆనందోత్సాహా లతో హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ పాల్గొని రాష్ట్ర ప్రజలందరికీ రంగుల హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:
About The Author
Latest News
14 Mar 2026 20:52:17
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
