మహదేవప్ప ది ఆత్మహత్య కాదు...కాంగ్రెస్ ప్రభుత్వం హత్య - సీఎం జిల్లాలో పెరిగిన అరాచకాలు
ప్రజలే బుద్ధి చెబుతారు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు .
నారాయణపేట ఫిబ్రవరి 10:
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6 వ వార్డు బి జెపి అభ్యర్థి ఎరుకల మహదే వప్ప మంగళవారం తెల్లవారు జామున ఫ్యాన్ కు ఉరి వేసు కుని మృతి చెందడం దురదృష్ట కారణమని ఆయనది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చెందిన హత్య అని బిజెపిరాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం మక్తల్ కు చేరుకున్నారు.ఎంపీ డి కే.అరుణ,బిజెపి రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ,రాష్ట్ర నాయకులు కే.రతంగ్ పాందురెడ్డి తో కలిసి ఆస్పత్రి వద్ద మహదేవప్ప మృతదేహంపై పూలు వేసి సంతాపం ప్రకటించారు .అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీఎం.రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు,దౌర్జన్యాలు శృతిమించిపోయాయని అన్నారు.ఓటమి భయంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బెదిరించడం,కిడ్నాప్ చేయడం సర్వ సాధారణం అయిందన్నారు.అందులో భాగంగానే రేపు పోలింగ్ అనగా నిన్నటిదాకా హుషారుగా ప్రచారం చేసి గెలుపుపై ధీమాగా ఉన్న మహదేవప్ప ఆత్మహత్యకు అధికార పార్టీ వేధింపులే కారణమని అన్నారు.ఆయనది ఆత్మహత్య కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని మండిపడ్డారు.దీనికి సి.ఏం.రేవంత్ రెడ్డి,మంత్రి వాకిటి శ్రీహరి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.పోలీసుల తీరు ఏమి బాగాలేదని అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని విమర్శించారు.మహదేవప్ప మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మహ దేవప్ప మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించా రు.ఆకుటుంబానికి అండగా బిజెపి నిలబడుతుందని తెలిపారు.
ఫోటో రైట్ అప్:5. విలేకరులతో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు,ఎంపి.డి కే.అరుణ
_______________________
