పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథంలో మహబూబ్ నగర్
ప్రతి రూపాయి పారదర్శక వినియోగమే లక్ష్యం - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
2026–27 తొలి కార్పొరేషన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్
మహబూబ్ నగర్ మార్చ్ 28 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయి ఖర్చు పారదర్శకంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఎటువంటి దుర్వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని, నిధులను సమర్థవంతంగా వినియోగిస్తేనే మహబూబ్ నగర్‌ను రాష్ట్రంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దవచ్చని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఐదు సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసే అవకాశం మీకు లభించిందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందాలని ఆయన సూచించారు. అనంతరం ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారిని కార్పొరేటర్లు ఘనంగా సన్మానించారు. సభలో అభినందనలు తెలియజేసి, ఆయన నాయకత్వంలో నగరం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
