బాల్య వివాహాలు నిరోధించాలి.
చిన్న పిల్లలను విధుల్లో చేర్పిస్తే చర్యలు తప్పవు.
By Ram Reddy
On
గొట్లపల్లి గ్రామ సర్పంచ్ ఎండి .సలాం.
లోకల్ గైడ్/తాండూర్:
బాల్య వివాహాలను నిరోధించాల్సిన బాధ్యత తల్లి దండ్రులు,అధికారులు ప్రతి ఒక్కరి పైన ఉంటుందని గొట్లపల్లి గ్రామ సర్పంచ్ ఎండి.సలాం అన్నారు. బుధవారం గ్రామ సర్పంచ్ సలాం ఆధ్వర్యంలో వివాహాలు,బాల కార్మికుల గురించి అవగాహన కల్పించారు. ఈ పలువురు మాట్లాడుతూ... బాల్య వయసులో వివాహాలు చేయడం వల్ల గర్భధారణ సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అంతే కాకుండా
శిశువులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. రక్తహీనత, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతాయి అని స్పష్టం చేశారు.
చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు భరించాల్సి రావడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ మేనేజర్ శివయ్య,సీసీలు,,వార్డు సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
14 Mar 2026 20:52:17
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
