కేజీబీవీలో భోజన నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం.

మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు.

కేజీబీవీలో భోజన నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం.

IMG-20260304-WA0103సిద్ధిపేట జిల్లా బ్యూరో (లోకల్ గైడ్ తెలంగాణ) 

 కొమురవెల్లి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. భాగార అన్నం, ఆలుగడ్డ, టమాటా గుడ్డు, సాంబారు, పెరుగు వంటలను తనిఖీ చేసిన కలెక్టర్ భోజనం నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భాగార అన్నం వాసనగా, రుచికరంగా లేకపోవడం, ఆలుగడ్డ కూర పలచగా ఉండడంపై వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెను ప్రకారం వండకుండా నిర్లక్ష్యంగా వంటలు చేయడం సరికాదని హెచ్చరించారు.

మెను పాటించినప్పటికీ వంట నాణ్యతగా చేయకపోవడంపై ఎస్ఓపై చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఫోన్ ద్వారా ఆదేశించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువుల గురించి ఆరా తీశారు. గణిత సబ్జెక్ట్‌లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.

గణితాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని, అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యాలయంలో భోజనం, ఆరోగ్యం, వసతి, చదువు విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags:

About The Author

Latest News