పెవిలియన్ గ్రౌండ్లో ఘనంగా ఖమ్మం రంగోత్సవ్ హోలీ మేళ

పెవిలియన్ గ్రౌండ్లో ఘనంగా ఖమ్మం రంగోత్సవ్ హోలీ మేళ


( ఖమ్మం: లోకల్ గైడ్)
సారధి నగర్ IMG-20260304-WA0112IMG-20260304-WA0113

ఖమ్మం నగరంలోని స్థానిక పేవిలియన్ గ్రౌండ్లో TRR ఆర్తో ఆక్సిడెంట్ కేర్ మరియు పలు సంస్థల సౌజన్యంతో ఖమ్మం రంగోత్సవ్ హోలీ మేళా ఘనంగా నిర్వహించారు 

ఈ కార్యక్రమంలో వేలాది మంది యువతి యువకులు  ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షగా నిలిచిన జబర్దస్త్ టీం తో ఉత్సవ సంబరాలను ఆటపాటలతో తీరొక్క రంగులతో రంగుల మయమై ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు.


ఈ రంగోత్సవ్ హోలీ మేళాలో ముఖ్యఅతిథిగా BRS జిల్లా నాయకులు తోట రామారావుపాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి వారు సైతం   యువతకేరింతల నడుమ తాను సైతం నృత్యాలు  చేస్తూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. 

వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ
హోలీ రంగులు, 
ప్రేమ మరియు ఆనందాల పండుగని. ఇది చెడు పై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుందని ఈ పండుగలో ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటు కుల మతాలకతీతంగా భేదాభిప్రాయాలను మరిచి స్నేహంతో సంబరాలు చేసుకుంటారని కొనియాడుతూ ఈ హోలీ
పండగ మన జీవితాల్లో కూడా సంతోషాలను రంగులను నింపాలని ఆశిస్తూ! రసాయనాలు లేని ప్రకృతి సిద్ధమైన రంగులతో  సురక్షితంగా   ఆనందంగా హోలీ జరుపుకుందామని పిలుపునిచ్చి *ఇంత మంచి ఈవెంట్* మన ఖమ్మంలో నిర్వహించటం చాలా గొప్ప శుభ పరిణామం అని  నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జబర్దస్త్ ఫ్రేమ్ తమ డాన్సులతో పాటలతో అలరించారు ఈ వీట్లో యువతీ యువకులకు ఖమ్మం నగర ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ తోట లక్ష్మణ్, తోట రమేష్ , కోటయ్య, కిషన్ నాయక్ , మహేష్ రవీందర్, వీరేందర్, మోటే కుమార్,  మరియు అనేక ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News