కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాప్!
వారికి ప్రజాసేవ చేసే లక్షణాలు లేవు. కౌన్సిల్లో బిఆర్ఎస్ గళం వినిపించాలి.
నూతన కౌన్సిలర్లకు బిఆర్ఎస్ ఇంచార్జి దిశా నిర్దేశం.
లోకల్ గైడ్/తాండూర్:
కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ కాబోతుందని, వారికి పరిపాలన అందించడం చేతకాదని మున్సిపల్ ఎన్నికల బిఆర్ఎస్ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు, పట్టణంలోని ఆయన నివాసంలో ఇటీవల గెలిచిన బిఆర్ఎస్ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. అదేవిధంగా కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి ఏ విధంగా అయితే సాధించుకున్నామో, మున్సిపల్ కౌన్సిల్లో కూడా తప్పకుండా 12 మంది కౌన్సిలర్లు పట్టణ ప్రజల పక్షాన బలంగా గొంతును వినిపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, నరేందర్ గౌడ్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్ శోభ రాణి,బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
