మధిర నియోజకవర్గ కేంద్రంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు.

మధిర:లోకల్ గైడ్:
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ--
ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు.
చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు ఐప్యాడ్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు అందిస్తూ వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
ఈ ప్రభుత్వంలో దివ్యాంగులకు ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని విధాలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. వారికి అవసరమైన అన్ని సంక్షేమ పథకాలు ప్రజా ప్రభుత్వం ద్వారా అందుతాయన్నారు.
దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతో పాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, దివ్యాంగుల గురించి సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సమాజంలోని ఇతరుల కంటే దివ్యాంగులకు మరింత ఆసరా, అవకాశాలు అందించాలని, అంగవైకల్యం అనే భావనతో బాధపడకుండా వారికి ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తెసుకెళ్లాలని ప్రభుత్వం ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
