మిర్యాలగూడ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది..
By Ram Reddy
On
మిర్యాలగూడ జనవరి 26
(లోకల్ గైడ్, తెలంగాణ )
మొదట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమంలో
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో* కలిసి పాల్గొని.. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు.. రిటైడ్ ఆర్మీ అధికారులను సన్మానించారు..అనంతరం ఎమ్మెల్యే క్యాంప్
కార్యాలయం* నందు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది..
అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.. అనంతరం మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ తో కలిసి సానిటైజేషన్స్ వర్కర్స్ కోసం 100 నూతన తోపుడు బండ్లను* ప్రారంభించారు.. అలాగే నూతన జనరేటర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!మన దేశం 1950 జనవరి 26న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా అవతరించిన చారిత్రక దినాన్ని స్మరించుకుంటున్నాము అని అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన రాజ్యాంగం, మనకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించిందన్నారు..
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం...
నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేసేందుకు కట్టుబడి ఉన్నానన్నారు..
ఐక్యత, శాంతి, అభివృద్ధిని కాంక్షిస్తూ, మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు..
Tags:
About The Author
Related Posts
Latest News
07 Feb 2026 05:54:48
లోకల్ గైడ్ కొత్తూరు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా షాద్నగర్ లోని 26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జామ మంజుల గెలిపించాలని 26 వార్డు ఇంచార్జ్ రంగారెడ్డి...
