లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం దుప్పట్ల పంపిణీ.

దాతల సహకారంతో గత 1033 రోజుల నుంచి జరుగుతున్న ఉచిత అల్పాహార పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం దుప్పట్ల పంపిణీ.

 మిర్యాలగూడ జనవరి 14
 (లోకల్ గైడ్,తెలంగాణ )

మిర్యాలగూడ పట్టణంలోని ఏరియా హాస్పిటల్ నందు లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత 1033 రోజుల నుంచి జరుగుతున్న ఉచిత అల్పాహార పంపిణీ,ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నల్లగొండ జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,న్యాయవాది పాశం రవీందర్ రెడ్డి గైనకాలజీ డాక్టర్ మంజుల తదితరులు. 
ఈ సందర్భంగా చింత రెడ్డి మాట్లాడుతూ.లయన్స్ క్లబ్ మిర్యాలగూడ అధ్యక్షులు నాయుడు అధ్యక్షతన దాతల సహకారంతో నిర్విరామంగా కొనసాగుతున్న ఉచిత అల్పాహార పంపిణీ నిరుపేదలైన రోగులకు వారికి సహకరిస్తున్నఅటెండర్స్ కు ఎంతో సహకారంగా ఉందని అన్నదానం అన్నింటికంటే మించినదని దుప్పట్ల పంపిణీ ప్రశంసనీయమని కొనియాడారు. మరి కొంతమంది దాతలు లయన్స్ క్లబ్ వారికి సహకరించాలని కోరుతూ తన వంతుగా 10000 రూపాయలు
అందజేస్తున్నానని
తెలియజేశారు ఈ కార్యక్రమంలో వేణుగోపాలరావు ,ఎండి సలీం, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్,లయన్స్ క్లబ్ సభ్యులు మురారి,భాగ్యలక్ష్మి,రాంరెడ్డి,శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి