మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి.

_బిజెపి శ్రేణులకు ఎంపి అరుణ దిశానిర్దేశం

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి.

నారాయణపేట జనవరి 11:

మున్సిపల్ ఎన్నికల లో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ లను గెలుచుకుని బిజెపి సత్తా చాటాలని పాలమూరు ఎంపి డి కే.అరుణ బిజెపి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో సత్య యాదవ్ గెస్ట్ హౌస్ లో జరిగిన పుర ఎన్ని కల సన్నాహక సమావేశం జిల్లా బిజెపి అధ్యక్షుడు సత్య యాదవ అధ్యక్షతన జరిగింది.సమావేశానికి ముఖ్య అతిథిగా పాలమూరు పార్లమెంటు సభ్యురాలు  శ్రీమతి డీకే అరుణమ్మ పాల్గొని మాట్లాడుతూ జిల్లా లోని ఏడు పురపాలక సంఘా లలోకార్యకర్తలందరూ కలి సికట్టుగా పనిచేసి భార తీయ జనతా పార్టీ జెండా ఎగుర వేయాలని అన్నా రు.అభ్య ర్థులను వార్డు మెంబర్లుగా మున్సిపల్ చైర్మన్గగా గెలిపిస్తే అభివృద్ధికి అడుగులు వేసినట్టు ఉంటుందని అన్నారు.ప్రజలు చాలా శ్రద్ధగా  ప్రధాని  నరేంద్ర మోడీ పథకాలకు ఆకర్షింపబడి ఓటు వేయడానికి వారి సిద్ధంగా ఉన్నారని అన్నా రు.అందరూ కలిసి పనిచేసే వారి వారి ఆశీర్వాదాలు తీసుకొని పురపాలక సంఘ సభ్యులుగా చైర్మన్లుగా గెలిచి రావాలని పిలుపు నిచ్చారు. 
గతంలో జరిగిన కొన్ని పొర పాట్లు ఈ ఎన్నికల్లో జరగ కుండా చూడాలని అన్నారు.ప్రతి వార్డులో బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంటు సభ్యురాలిగా ప్రధాని నరేంద్ర మోడీ  నిధులను మీ మీ వార్డులలో మీ మీ నగరాలలో వరదలుగా పారి అభివృద్ధిచెందుతాయని అన్నారు. ఈ సమావేశంలో పురపాలక సంఘాల ఇన్చార్జులు కొత్త కాపు రతన్ పాండు రెడ్డి,బలరామిరెడ్డి భాస్కర్  అమరచింత ఆత్మకూర్లు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి,మద్దూర్ కోసిగి నాగుల పల్లి ప్రతాప్ రెడ్డి కొడంగల్ పున్నము చంద్ లాహోటి, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ అదనపు న్యాయవాది  నందు నామాజీ కృష్ణ చైతన్య  జిల్లా ప్రధాన కార్యదర్శి  లక్ష్మీ శ్యాంసుందర్ గౌడ్ ,జిల్లానాయకులు రఘు రామయ్య గౌడ్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సత్య రఘుపాల్ రెడ్డి,పట్టణ బిజెపి అధ్యక్షుడు పోషల్ వినోద్, మిర్చి వెంకటయ్య  వెంకట రాములు బిల్డర్  మదన్ అడ్వకేట్ కర్నేస్వామి సుజాత కృష్ణ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి