వికారాబాద్ జిల్లాలో నూతనంగా గెలిచిన బీసీ సర్పంచ్‌లకు ఘన సన్మానం

బీసీల ఐక్యతతో భవిష్యత్తులో మరిన్ని పదవులు సాధించాలి..భేరి రామచంద్ర యాదవ్

వికారాబాద్ జిల్లాలో నూతనంగా గెలిచిన బీసీ సర్పంచ్‌లకు ఘన సన్మానం

 

పరిగి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలంలో గల కేరవెల్లి నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాటం రామచంద్రయ్య యాదవ్ ఎన్నికైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ..ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు అధిక సంఖ్యలో గెలవడం ఎంతో సంతోషకరమని తెలిపారు. బీసీల ఐక్యత కొనసాగితే రానున్న రోజులలో ఎంపీటీసీ, జడ్పిటీసీ, కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్‌, గ్రేటర్ హైదరాబాద్‌లో కార్పొరేటర్‌ స్థాయిలలో కూడా బీసీలు భారీ ఎత్తున గెలవగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు అన్ని బీసీ సంఘాలు సమన్వయంతో పనిచేయాల ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ కాటం రామచంద్రయ్య యాదవ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే కేరవెల్లి గ్రామ వార్డ్ మెంబర్ భోగవని రాఘవేందర్ యాదవ్‌ను కూడా శాలువాతో సన్మానించి, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాటం రామచంద్రయ్య యాదవ్ (సర్పంచ్, కేరవెల్లి),
భోగవని రాఘవేందర్ యాదవ్ (వార్డ్ మెంబర్, కేరవెల్లి),భేరి ఆంజనేయులు యాదవ్ (మిట్టకంకల్ యువజన సంఘం), కొజ్జ భాస్కర్, నవాజ్ (ఎమ్మెల్యే పీఏ), ఇబ్రహీం, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి