భైంసా క్యాంపు ఆఫీస్ లో  ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల. 

భైంసా క్యాంపు ఆఫీస్ లో  ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల. 

 

భైంసా : లోకల్ గైడ్ :
జిల్లా లోని భైంసా క్యాంపు ఆఫీస్ లో బుదువారం నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా ఫిర్యాదు దారుల నుండి  జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిలఫిర్యాదులు స్వీకరించారు. భైంసా డివిజన్ లోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల కు ఫిర్యాదులు అందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆమె ప్రతి ఒక్క ఫిర్యాదుదారుడి సమస్యను ఎంతో ఓర్పుతో, శ్రద్ధగా విని,సంబంధిత పోలీసు అధికారులకు వెంటనే విచారణ జరిపి, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం లేకుండా పనిచేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా తమ సమస్యలను నేరుగా వినిపించుకునే అవకాశం కల్పించినందుకు ఫిర్యాదుదారులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

About The Author

Latest News