హనుమాన్ నామస్మరణతో మార్మోగిన కిస్మత్పూర్.
హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఎంతో ఘనంగా నిర్వహించారు.
By Ram Reddy
On
రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ): బండ్లగూడ జాగిర్ కిస్మత్పూర్ పరిధిలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఎంతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తొలి శాసనమండలి మాజీ చైర్మన్ కిస్మత్పూర్ దేవాలయ కమిటీ చైర్మన్ స్వామి గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకల సందర్బంగా హనుమాన్ నిర్వహించారూ. కిస్మత్పూర్ లోని స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద నుంచి హనుమాన్ విగ్రహాలను గ్రామంలోని నలుమూలల ఊరేగింపుగా తీసుకెళ్తూ జై హనుమాన్ జై శ్రీరామ్ అను నినాదాలు వీధుల్లో తిప్పుతూ ఊరేగించారు . ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు యువత వివిధ ప్రజా పార్టీ నాయకులు మహిళలు అందరు ఉత్సహంగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు.
Tags:
About The Author
Latest News
08 Apr 2026 23:24:30
( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
