నామినేషన్ కేంద్రాల వద్ద క్బందోబస్తు పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

నామినేషన్ కేంద్రాల వద్ద 164 బి ఎన్ ఎస్ (144 ) సెక్షన్ అమల్లో ఉంది.

నామినేషన్ కేంద్రాల వద్ద క్బందోబస్తు పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల సహకరించాలి.  ముందస్తు ర్యాలీల, మైక్ పర్మిషన్లు తీసుకోవాలి.

నారాయణపేట జనవరి 28:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యం లో నారాయణపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. నారాయణపేట, మద్దూర్ మున్సిపల్ నామినేషన్ కేంద్రా లను బుధవారం ఆయన పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచన లు చేశారు.నామినేషన్ కేంద్రాల వద్ద 164 బి ఎన్ ఎస్ (144) సెక్షన్ అమల్లో ఉంద ని, 200 మీటర్ల పరిధిలో గుంపులు గుంపులుగా ఎవరు ఉండరాదని స్పష్టం చేశారు. అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులకే అను మతి ఉంటుందని తెలిపారు.
ఎన్నికలలో పోటీ చేసే అభ్య ర్థులు ర్యాలీలు, వాహనాల మైక్ వినియోగానికి ముంద స్తుగా పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి అని సూచించా రు. ఎన్నికలు శాంతియు తంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని, నిబంధ నలు ఉల్లంఘిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చ రించారు.జిల్లాలో స్వేచ్ఛా యుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని, ఇంతకు ముందు గ్రామపం చాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్పీ కోరారు. ఎస్పీ తో పాటు ఎస్ బి ఎస్సై నరేష్, మున్సిప ల్ అధికారులు, స్థానిక పోలీ సులు ఉన్నారు.
ఫోటో రైట్ అప్:5.నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ.

Tags:

About The Author

Latest News