డా .తీడ వేద భార్గవి కూచిపూడి నాట్య గురు వేద

నాట్య కళాశాల సంస్థ వారికి ఉగాది విశిష్ట కళా పురస్కార్ 2026 అవార్డు ప్రధానం చేశారు

డా .తీడ వేద భార్గవి కూచిపూడి నాట్య గురు వేద

 

కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 1 ( లోకల్ గైడ్ ప్రతినిధి)

 

రవీంద్ర భారతిలో కీర్తి ఆర్ట్స్ అకాడమీ సాంస్కృతిక ఈవెంట్ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టీవ్ వరాభవ నామ సంవత్సర ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చందా నగర్ వాస్తవ్యురాలు డా. వేద భార్గవి కూచిపూడి నాట్య గురువు వేదనాట్య కళాశాల వారికి ఉగాది విశిష్ట కళా పుష్కర్ 2026 అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా డా. వేద భార్గవి మాట్లాడుతూ నేను గత 30 సంవత్సరాలుగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు అనేక వేదికల మీది ప్రదర్శించడం జరిగింది. చిన్ననాటి నుండి కూచిపూడి నృత్య ప్రదర్శన మీద ఆసక్తి ఉండటం వలన కూచిపూడి నాట్యంలో ప్రావీణ్యం సంపాదించడం జరిగింది చందానగర్లో కూచిపూడి వేద నాట్య కళాశాల స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు కూచిపూడి నృత్య ప్రదర్శనలో నేర్పించడం జరిగింది ఈ కళా రంగంలో చేసిన సేవలు కానీ ఈ సంస్థ వారు నన్ను గుర్తించి ఈ అవార్డు నాకు ఇయ్యటం జరిగిందని తెలిపారు. ఈ అవార్డు తీసుకోవడం వలన నా బాధ్యత మరింత పెరిగిందని చాలా సంతోషము ఆనందంగా ఉందని అన్నారు విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలాంటి గురువు తొరకటం మా పిల్లలు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అని వారు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థినీలు మాట్లాడుతూ ఇలాంటి గురువు దొరకటం మాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. విద్యార్థినిలు సందర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అత్యంత వైభోగంగా ఉందని సభికులు వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీలు హర్షిత, దీక్షిత, జాహ్నవి, లోకేశ్వరి, అరణ్య, శ్రేష్ట, ఇషిక, గాయత్రి, సర్విక, తన్వి, దేవి ప్రియాంక, రిత్విక, కీర్తి ఆర్ట్ అకాడమీ బిందు లిమ్మా తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News