త్రివేణిలో ఘనంగా ‘ఎర్త్ అవర్’ అవగాహన కార్యక్రమాలు  

త్రివేణిలో ఘనంగా ‘ఎర్త్ అవర్’ అవగాహన కార్యక్రమాలు  

 

( లోకల్ గైడ్ ) ఖమ్మం
మార్చి 28 శనివారం రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు, గంట పాటు అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాలను స్విచ్చాఫ్ చేసి ‘ఎర్త్ అవర్’ కార్యక్రమంలో పాల్గొనాలని, తద్వారా భూమిని పరిరక్షించాలని త్రివేణి పాఠశాల యాజమాన్యం మరియు ఖమ్మం జిల్లా NCSC కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ప్రచారాన్ని (Campaigning) నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖనం పోటీలను ఘనంగా నిర్వహించారు.డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి (పాఠశాల డైరెక్టర్)మాట్లాడుతూ 
"ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతి ఏటా ‘ఎర్త్ అవర్’ పాటిస్తున్నారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు దీనిని నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాత్రి 8:30 నుండి 9:30 వరకు అందరూ స్వచ్ఛందంగా విద్యుత్ దీపాలను ఆపివేసి సహకరించాలి"అన్నారు.
రాజేంద్ర ప్రసాద్ (ప్రిన్సిపాల్ ) మాట్లాడుతూ 
"2007లో ఆస్ట్రేలియా లోని సిడ్నీలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) ఆధ్వర్యంలో ఈ ఎర్త్ అవర్ ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దీనిని కొనసాగిస్తున్నారు”అన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణవేణి-త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, పాఠశాల సి.ఆర్.ఓ (CRO) కాట్రగడ్డ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్స్ స్వప్న, ముస్తఫా, క్యాంపస్ ఇంచార్జ్ చార్లెస్, సందీప్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్ మెట్రో వేళల మార్పుపై కేంద్రానికి వినతి. హైదరాబాద్ మెట్రో వేళల మార్పుపై కేంద్రానికి వినతి.
లోకల్ గైడ్  హైదరాబాద్హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను ముందుకు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి వెళ్లింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో...
ఖేలో ఇండియా వేదికగా తెలంగాణకు కీర్తి తేవాలని మౌనిక లక్ష్యం
ఎన్ఎస్ఎస్ శిబిరంలో కంటి వైద్య పరీక్షలు...
లోక్ అదాలత్ లో 740 కేసులు పరిష్కారం. 
త్రివేణిలో ఘనంగా ‘ఎర్త్ అవర్’ అవగాహన కార్యక్రమాలు  
అభివృద్ధి దిశగా సింగరేణి గ్రామం
హనుమకొండ రమేష్ దంపతులకు ఘన సన్మానం