పెన్షన్ల కోసం ఎదురుచూపులు.

7 ఏళ్లు గడుస్తున్నా అందని చేయూత. తీవ్ర నిరీక్షణలో వృద్ధులు, వితంతువులు. 

పెన్షన్ల కోసం ఎదురుచూపులు.

నిత్యం అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. -  పట్టించుకోని అధికార యంత్రాంగం.

లోకల్ గైడ్/తాండూర్
 నూతనంగా చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు నిరీక్షణ తప్పడం లేదు. గత ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచి ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లు దాటినా స్పందించడం లేదు. దీంతో లబ్దిదారులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. మరోవైపు భర్తలు కోల్పోయి ఒంటరిగా మిగిలిన మహిళలతో పాటు 57 ఏళ్ళు దాటిన వారందరూ కొత్త చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేస్తు న్నారు. వీరితో పాటు ఎంతో మంది వితంతువులు, అర్హులైన వృద్ధులతో పాటు దివ్యాంగులు నిత్యం అధికారులు, రాజకీయ నాయకులు, కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. కొత్త పింఛన్ కోసం మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ నేటికీ మంజూరుకు నోముకోలేదు. దీంతో  కుటుంబంలో కొడుకులు చేరదీయక అనేకమంది వృద్ధులు, నిస్సహాయకులు ఎప్పుడొస్తాయా పెన్షన్లు అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

 భారంగా కుటుంబ పోషణ.
భర్త మరణించిన వితంతువులు,57 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 2019 నుంచి
ఇప్పటివరకు అనేక మంది పింఛన్ కోసం మండల పరిషత్ కార్యాలయం, పంచాయతీ కార్యదర్శిల వద్ద దరఖాస్తు చేసుకున్నారు. పలు సందర్భాల్లో మండల అధికారులు పంచాయతీ కార్యదర్శులకు పింఛన్ దరఖాస్తులను ఆన్లైన్ చేయించాలని సూచించిన ప్పటికీ ప్రభుత్వం ద్వారా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో దరఖాస్తులు చేసుకున్న ఆశావహులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు.ఎమ్మెల్యే గ్రామాలకు వచ్చినప్పుడల్లా పింఛన్ ఇప్పించాలని ప్రాధేయపడుతున్నారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు