ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రతపై దృష్టి

సిద్దిపేటలో ట్రాఫిక్ పోలీసుల ప్రచారం

ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రతపై దృష్టి

సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
 
మార్చి26: గురువారం సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన “అరైవ్-అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమం భాగంగా ఈరోజు సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో  ట్రాఫిక్ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌.ఐ గోపాల్ రెడ్డి, ఎస్‌.ఐ ఉమేష్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొని వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్‌ఐ ముద్ర కలిగిన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. “వేగం కన్నా ప్రాణం మిన్న” అని హెచ్చరిస్తూ, అధిక వేగంతో వాహనాలు నడపవద్దని సూచించారు. రాంగ్ రూటు డ్రైవింగ్,సిగ్నల్ జంపింగ్ వల్ల జరిగే ప్రమాదాలను వివరించ్చారు, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు.రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాద రహిత సిద్దిపేట సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం, విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం,
  ( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.
ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి నీడ - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 
రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన