లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం.

మిర్యాలగూడ ఫిబ్రవరి 17
 (లోకల్ గైడ్,తెలంగాణ )

 వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో సూర్యాపేట లయన్స్ క్లబ్ ఆఫ్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి18 బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట లయన్స్ క్లబ్ చైర్మన్ మిర్యాల సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించుచున్నట్లు తెలిపారు. వైద్యులకు ఎలాంటి ఫీజు లేకుండా రోగులను పరిశీలించి అవసరమైతే కంటికి శస్త్ర  చికిత్సలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కంటి  సమస్యతో బాధపడుతున్న వారు వారి వెంట ఆధార్ కార్డు తీసుకొని రాగలరని మిర్యాల సుధాకర్ తెలిపారు.

Tags:

About The Author

Latest News