పుష్య సప్తష్టమి నాడు శాస్త్రోక్తంగా శనేశ్వర స్వామికి తిలతైల అభిషేక పూజలు
శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం నాడు ప్రత్యేకంగా తిలతైల అభిషేకాలు
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
శ్రీ విశ్వవసు సంవత్సరం పుష్య మాసం కృష్ణపక్షం సప్తాష్టమి శనివారం నాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామికి భక్తులచే శని గ్రహ దోష నివారణకు స్వామి వారికి తిలతైలా అభిషేకలు భక్తితో శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం నాడు ప్రత్యేకంగా తిలతైల అభిషేకాల పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ శనీశ్వర స్వామి జన్మ నక్షత్రం పుష్యమి కావడంతో ఈ పుష్య మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారని ఆయనఅన్నారు. ప్రతి ఒక్కరు జన్మ రిత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని అన్నారు ఈ పుష్య మాసంలో జనవరి నెలలో 17 తేదీలలో శనివారం వస్తాయని,అదేవిధంగా పుష్యమి నక్షత్రం ఉన్న రోజు, అమావాస్య రోజు స్వామివారిని కోలవడం ఇంకా విశేష ఫలితం అని, స్వామివారినీ ఇష్టమైన నువ్వుల నూనె,నువ్వులు బెల్లము,జమ్మి ఆకు,నల్లని వస్త్రాలు,నీలిరంగు జిల్లేడు పూలతో పూజించడంతో, దానం చేయడంతో స్వామివారి అనుగ్రహం ప్రాప్తిస్తుందని అన్నారు.ఈ ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి భక్తులచే రుద్రాభిషేక పూజలు,అర్చనలు, దీపారాధన నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు భక్తులచే నిర్వహించారు.అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు.ఈకార్యక్రమం లో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, కమిటీ సభ్యులు కేంచే రాజేష్,ప్రభాకరచారి, పుల్లయ్య,అడ్వకేట్ వీర శేఖర్ చారి,శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమమహేశ్వర్,సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
