లక్కీ డ్రా విజేతలకు బహుమతుల ప్రధానం
బాలాజీ ఎలక్ట్రానిక్స్ లో ఫెస్టివల్ బోనంజ లక్కీ డ్రా
బహుమతులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి.
*లోకల్ గైడ్/ తాండూర్:*
తాండూర్ పట్టణంలోని బాలాజీ ఎలక్ట్రానిక్స్ లో ఫెస్టివల్ బోనంజ లక్కీ డ్రా విజేతలను డ్రా పద్ధతిన ఎంపిక చేసి గురువారం బహుమతులను అందజేశారు. పట్టణంలోని ఇందిరా చౌక్ సమీపంలో గల బాలాజీ ఎలక్ట్రానిక్స్ గత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన ఫెస్టివల్ బోనంజ లక్కీ డ్రా తీశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు మహిపాల్ రెడ్డి. బాతుల వెంకటేశం హాజరయ్యారు. అనంతరం వారికి శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ మేరకు లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేసి వారికి బాల్రెడ్డి, మైపాల్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.మొదటి మహుమతిగా తలారి నరేష్, రెండవ బహుమతి ఎం. శ్రీకాంత్, మూడవ బహుమతి మణెమ్మ దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా బాల్ రేడ్డి, మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ..వినియోదారులకు నాణ్యమైన వస్తువులను అందించడంతోపాటు, లాభం చేకూరే విధంగా ఫెస్టివల్ బోనంజ పేరుమీద బహుమతులను అందజేయడం అభినందనీయమని అన్నారు. బాలాజీ ఎలక్ట్రానిక్స్ పైన ప్రజలకు ప్రగాఢ విశ్వాసం ఏర్పడిందని అన్నారు. భవిష్యత్తులో ఇంకా ప్రజల మద్దతు కూడా కట్టుకోవాలని ఆకాంక్షించారు.
