ఘనంగా శివ మహా పడిపూజ .
పుర విధుల్లో అఖండ జ్యోతి,పల్లకి సేవ ఊరేగింపు.
నారాయణపేట ఫిబ్రవరి 1:
నారాయణపేట పట్టణంలో ఆదివారం శివాలయంలో శివ మహా పడిపూజ అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పుర వీధుల గుండా అఖండ జ్యోతి, పల్లకి సేవ ఊరేగింపు నిర్వహించారు.ద్వాదశ జ్యోతి ర్లింగాల మహా పూజ అధ్యంతం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ కొనసాగింది. గురు స్వాముల ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగా లు ఏర్పాటు చేసి వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి శివుడి విగ్రహానికి అభిషే కాలు, బిల్వార్చన మహా మంగళ హారతి తదితర పూజలు ఘనంగా నిర్వహిం చారు. ఉదయం గ్రామ పురవీధుల గుండా నిర్వహిం చిన కలశం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఈశ్వర్ మందిర్ లో కొనసాగి న ద్వాదశ జ్యోతిర్లింగాల మహా శివపూ జలో శివుడి విగ్రహానికి అభిషేకాలు మహా మంగళ హారతి, బిల్వార్చన నిర్వహిం చారు. శివ స్వాముల ద్వాదశ జ్యోతిర్లింగాల పూజ మహా పూజో త్సవం కన్నుల పండుగగా కొనసాగింది. గురుస్వాములు , శివ స్వాముల ఆధ్వర్యంలో పాడి న భక్తి గీతాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి. శివనామస్మరణతో మార్మోగింది. మహా పూజ పురస్కరించుకొని శివ స్వాములతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది సాయంత్రం ఏడు గంటలకు ఈశ్వర్ మందిర్ లో నందికోల సేవ ఎంతో అత్యంత వైభవం గా నిర్వహించారు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్:1.పల్లకి సేవ ఊరేగింపు
____________________
