ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.

డీఎస్పీ నల్లపు లింగయ్య

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.

నారాయణపేట జనవరి 31:
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయు తంగా రోడ్డు భద్రతా నియమా లు పాటించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి వ్యక్తిగత బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
శనివారం రోడ్డు భద్రత మాసో త్సవాలు–2026 సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రం లో రోడ్డు ప్రమాదాల నివారణే ముఖ్య లక్ష్యంగా నెల రోజుల పాటు రోడ్డు భద్రత నియమా లు, ట్రాఫిక్ రూల్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాల ను రోడ్డు రవాణా శాఖ అధికా రులు, జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నెల రోజులపా టు వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రం లోని మినీ స్టేడియం గ్రౌండ్ నుండి ఓల్డ్ బస్టాండ్ మీదుగా సత్యనారాయణ చౌరస్తా వర కు భారీ అవగాహన ర్యాలీని మద్యం వద్దు ప్రాణం ముఖ్యం, హెల్మెట్ ధరిస్తే ప్రాణాలకు భద్రత, సీట్ బెల్టు కట్టుకోండి సురక్షితంగా గమ్యానికి చేరుకోండి, అధిక వేగం ప్రమాదానికి ఆహ్వానం వంటి నినాదాలు చేస్తూ ప్రజల్లో రోడ్డు భద్రతపై చైత న్యం కల్పించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచడం, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను తెలియజేయడం ముఖ్య ఉద్దే శ్యమని తెలిపారు.ఈ సంద ర్భంగా డీఎస్పీ నల్లపు లింగ య్య మాట్లాడుతూ ముఖ్యం గా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అధికవేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాష్ డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి కారణాలు ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అవి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అధిక వేగం తో వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించా రు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియ మాలను కచ్చితంగా పాటిం చాలని సూచించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేష్ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాల పాటింపు ద్వారా అనేక ప్రాణాలను కాపాడవ చ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, తమ ఇంట్లో తల్లి దండ్రులకు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు, ఇరుగు పొరు గు వారికి, రోడ్డు భద్రత నియ మాలు పాటించాలని వాళ్లకు అవగాహన కలిగేలా ఇంట్లో చెప్పాలని సూచిం చారు. అనంతరం సత్యనారాయణ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి విద్యార్థులు ప్రజలు వాహనదారులు అధికారులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయడం చేశారు.ఈ కార్యక్రమంలో
డి టి ఓ మెగా గాంధీ, ఆర్టీసీ డి ఎం. లావణ్య, సీఐ శివశంకర్, ఎం వి ఐ బోధిశ్రీ ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటరమణ,ఎస్ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణ చైతన్య,
ఏ ఎం వి ఐ లు సాయి తేజ రెడ్డి,ఉపాధ్యాయులు, విద్యా ర్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:2.సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్పీ లింగయ్య 
________________________

Tags:

About The Author

Latest News