ఖమ్మం జిల్లా,కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 1 :
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమనేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేయటం కక్ష సాధింపు చర్యేనని బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ ఆరోపించారు.ఆదివారం సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ లో ఖమ్మం ప్రధాన రహదారిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫోన్ టాపింగ్ కేసులో ఇరికించేందుకే సిట్ అధికారులు విచారణ చేయడం సరైన పద్ధతి కాదని,ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేస్తూ మండల బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.దాదాపు గంట వరకు సాగిన ఈ రాస్తారోకో లో ముత్యాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకే కెసిఆర్ పై విచారణ చేస్తున్నారని విమర్శించారు.రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైన ప్రభుత్వం గిట్టుబాటు ధర, రైతు భరోసా ఇవ్వకుండానే రైతులను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో దొడ్డిదారిన గెలవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రులు,ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.దాదాపు గంట వరకు సాగిన రాస్తారోకో సందర్భంగా రహదారిపై రెండువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.విషయం తెలుసుకున్న కారేపల్లి ఎస్ ఐ బైరు గోపి తన సిబ్బందితో వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.ఈ రాస్తారోకోలో మాజీ జడ్పి టీ సి లు ఉన్నం వీరేందర్, వంకుడోత్ జగన్ నాయక్, కొత్త తండా సర్పంచ్ దారావత్ మంగీలాల్, తాత వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్లు బానోత్ రాందాస్, జర్పల హచ్చు, బానోత్ శంకర్, బానోత్ మోహన్, నాయకులు డొంకన రవీందర్, మణికొండ నాగేశ్వర్రావు, మాలోత్ పాడిత్య, తాతా ఉపేందర్, గుగులోత్ రవి, తదితరులు పాల్గొన్నారు.