ఒకటవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం మహిళలతో మాటామంతి

పాలకుర్తి శాసనసభ్యురాలు  యశస్విని రెడ్డి  ఆ వార్డులోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

ఒకటవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం మహిళలతో మాటామంతి


తొర్రూర్ (లోకల్ గైడ్) 
తొర్రూర్ మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తాళ్లపల్లి శ్రీలత రమేష్ ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, పాలకుర్తి శాసనసభ్యురాలు  యశస్విని రెడ్డి  ఆ వార్డులోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  మహిళలతో స్నేహపూర్వకంగా మాటామంతి జరిపి, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహిళల సాధికారతకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. తొర్రూర్ పట్టణ సమగ్ర అభివృద్ధి, మహిళల సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని పేర్కొంటూ, ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు అందించి తాళ్లపల్లి శ్రీలత రమేష్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని మహిళలను కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News