త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో మెరిసిన “కలారాధన
కూచిపూడి డాన్స్ అకాడమీ” సంక్రాంతి సంబరాలు రవీంద్రభారతిలో అట్టహాసంగా
By Ram Reddy
On
పట్లూరి జయంతి ఎం ఏ,(కూచిపూడి).ఫౌండర్ ఆఫ్ కళారాధన. కూచిపూడి డాన్స్ అకాడమీ
కుత్బుల్లాపూర్ జనవరి 31( లోకల్ గైడ్ ప్రతినిధి)
ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన పట్లూరి జయంతి ఎం.ఏ (కూచిపూడి), ఫౌండర్ – కలారాధన కూచిపూడి డాన్స్ అకాడమీ, ఈ సందర్భంగా మాట్లాడుతూ కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యరూపం. ఇది కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఉద్భవించింది. భక్తి, అభినయం, సున్నితమైన కదలికల సమ్మేళనమైన ఈ నృత్యం, సాంప్రదాయ భారతీయ కళాసౌందర్యానికి ప్రతీక” అని అన్నారు.కూచిపూడి నృత్య మహిమను వివరించిన పట్లూరి జయంతిఆమె మాట్లాడుతూ — “ఈ నృత్యం సిద్ధేంద్ర యోగి మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఇది పౌరాణిక గాథలను, దైవీయ ఇతివృత్తాలను నాట్యరూపంలో ప్రజల ముందుకు తెస్తుంది. హస్తముద్రలు, శిల్ప సదృశమైన భంగిమలు, వేగవంతమైన పాద కదలికలు, సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు — ఇవన్నీ కలిపి కూచిపూడిని ఒక సమగ్ర కళారూపంగా నిలబెడతాయి” అని తెలిపారు.
కూచిపూడిలో అత్యంత ప్రసిద్ధమైన ‘తరంగం’ (పిత్తాళ పళ్లెం అంచుపై నిలబడి చేసే నృత్యం) ప్రదర్శనను ప్రస్తావిస్తూ, “అది కూచిపూడి నైపుణ్యానికి ప్రతీక. ఆ నృత్యరూపానికి వెంపటి చిన్న సత్యం వంటి దిగ్గజులు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చారు” అని ఆమె గుర్తుచేశారు.చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు సాంప్రదాయ కూచిపూడి నృత్య రూపాలను సమర్థంగా ప్రదర్శించారు. ‘భక్తి, శివతాండవం, రాధా కృష్ణ నృత్యం, సీతా స్వయం వరం’ వంటి అంశాలపై సన్నివేశాలు అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రేక్షకుల కరతాళధ్వనులతో సభ ప్రాంగణం మార్మోగింది.
అవార్డులు, ప్రశంసా పత్రాలు ప్రదానంఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్న ప్రధాన అతిథులు, “ఇలాంటి కార్యక్రమాలు భారతీయ శాస్త్రీయ కళలను కాపాడటమే కాకుండా, భవిష్యత్ తరాలకు అవి ఆత్మవిశ్వాసం, సంస్కృతి, శ్రద్ధ నేర్పుతాయి” అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులుయాంకర్
గురు కుమారి టి భవ్య మైత్రి కళానికేతన్, నీలకంటి హంస గాయత్రి, గురు మాధవపెద్ది మాధురి వాగ్దేవి ఇన్స్టిట్యూట్టీ,చర్: సౌజన్య గురువు డి. జయలక్ష్మి శ్రీనివాస్,కర్ణాటక సంగీత గాయకుడు సంగీత ఉపాధ్యాయుడుపల్లవి మోడల్ స్కూల్ (బోడుప్పల్) ,జయలక్ష్మి సంగీత,నాట్యాలయ భరతనాట్యం, గురు జ్యోతి మారాదని,ఎంఏకూచిపూడిజ్యోతి,నాట్యాలయం
గురువు డాక్టర్ కైరిక నందినిత్రిపుర నృత్య భారతి క్లాసికల్ డ్యాన్స్ అకాడమీటీచర్ పేరిణి అపర్ణ, శ్రీ మాట ఆర్ట్స్ అకాడమీ,టీచర్: జ్యోత్స్న బెన్నా, ఎం ఏ కూచిపూడి,మోక్ష కూచిపూడి డాన్స్ అకాడమీ,గురు ఎస్ రజిత, ఎం ఏ కూచిపూడినిత్యశ్రీ డ్యాన్స్ అకాడమీ
గురువు:మాధురి కారంతోటేచైనానృత్యకళ డ్యాన్స్ అకాడమీ,శ్రీకాంత్ కోడలి ,కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ అతిథులు,అభినవ సత్యలీనఆచార్య శ్రీ కళాకృష్ణ ,
వైకుంఠ నారాయణ మూర్తి ,ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్, స్క్రిప్ట్ రైటర్.వాణి రమణ
డైరెక్టర్, ఎస్ జి ఎస్ డ్యాన్స్ అకాడమీ నృత్య భూషణ్
వడ్లమన్నటి అన్నపూర్ణ , ఎం ఏ వీణ,సిహెచ్. సీతా మహా లక్ష్మి,మృదంగండాక్టర్ ఆర్ శ్రీకాంత్ ఎం ఏ మృదంగంవయోలిన్ బట్టిపవన్ సింగ్ఈ వేడుకలకు గురువు వి. దుర్గా శ్రీకృష్ణ, శ్రీ హరి, కళారాధన అకాడమీ టీమ్ సభ్యులు, తల్లిదండ్రులు, కళాభిమానులు, సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సాంస్కృతిక వేడుక త్యాగరాజ ఆరాధనోత్సవాల ఆధ్యాత్మిక స్ఫూర్తితో, కూచిపూడి నృత్యం యొక్క శాస్త్రీయ సౌందర్యం, సాంస్కృతిక గౌరవంలను ఒకే వేదికపై మేళవించి మరపురాని అనుభూతిని కలిగించింది.
Tags:
About The Author
Latest News
11 Feb 2026 19:02:09
జూలూరుపాడు, లోకల్ గైడ్ : ఫిబ్రవరి 12 : జూలూరుపాడు మండల పరిధిలో అనంతరం గ్రామ సర్పంచ్ బ్రతకడానికి ఒక ఆశ ఇలా బ్రతకాలి అన్న
