ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత
వహించాలి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
రంగారెడ్డి జిల్లా బ్యూరో, (లోకల్ గైడ్ ): ఫిబ్రవరి 11 న జరిగే మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం వాతావరణం లో జరిగేలా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు.
శనివారం ఎన్నికల నిర్వహణలో భాగంగా షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో షాద్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్ తో కలిసి శనివారం పరిశీలించారు. నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియను పరిశీలిస్తూ ఏ విధంగా స్క్రూట్నీ చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చేయాలని వారికి పలు సూచనలు చేశారు. మున్సిపల్ షాద్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లను, ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తు, ఎన్నికలకు సంబంధించిన ఫర్నిచర్ అదేవిధంగా స్టేషనరీ తదితర అంశాలను మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డిని అడిగి తెలుసుకొని వాటిని పరిశీలించారు. నామినేషన్లకు సంబంధించి స్క్రూట్నీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమును, కౌంటింగ్ హాల్ ను పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అశ్రద్ధ చేయకూడదని సజావుగా జరిగే విధంగా అధికారులు సిబ్బంది అందరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు, 13న జరగబోయే కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ కు వివరించారు.
కలెక్టర్ వెంట షాద్ నగర్ ఆర్డిఓ సరిత, షాద్ నగర్ తహశీల్దార్ నాగయ్య, స్పెషల్ ఆఫీసర్ రామరావు, ఎస్.హరీష్, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.
