లంబాడీల సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
గిరిజన లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
తొర్రూరు లోకల్ గైడ్ :
గిరిజన లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని టిపిసిసి ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు.
తొర్రూరు పట్టణంలోని 5వ వార్డు బంజారా నగర్ (దుబ్బ తండ) లో సోమవారం రాత్రి తీజ్ పండుగ వేడుకలను తండావాసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఝాన్సీ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు.
ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ తీజ్ పండుగ గిరిజన సంప్రదాయం, భక్తి భావం, క్రమశిక్షణతో పాటు అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని కనిపెట్టి ఆహారాన్ని పండించిన లంబాడ బంజారాలు జరుపుకునే అతి ముఖ్యమైన పండగ తీజ్ అని అన్నారు. గోర్ బంజారా సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా జరిపి జాతి ఐక్యతను చాటాలన్నారు.
About The Author
Related Posts
