కార్మికుల హక్కులను కాలరాసేందుకే కేంద్ర సర్కార్ లేబర్ కోడ్ తెచ్చారు.                                                                    

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరుగ్యారంటీల్లో  బస్సు ఫ్రీ తప్ప ఇతర ఏ హామీలను అమలు చేయడం లేదు- రంగారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి పాలమాకుల జంగయ్య.        

కార్మికుల హక్కులను కాలరాసేందుకే కేంద్ర సర్కార్ లేబర్ కోడ్ తెచ్చారు.                                                                    

  రాజేంద్రనగర్ ఫిబ్రవరి 18 (లోకల్ గైడ్):                                కార్మికుల హక్కులను కాల రాసిందికే కేంద్ర సర్కార్ లేబర్ కోడ్ లను తెచ్చిందని భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, జాతీయ కౌన్సిల్ సభ్యులు పాలమాకుల జంగయ్య విమర్శించారు. ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం  ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. బుధవారం రాజేంద్రనగర్ బుద్వేల్ ల్లోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే దొందు దొందేనని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తూ పెట్టుబడిదారులకు తొత్తులుగా మారుతున్నారని ఆరోపించారు. తోక పార్టీలు అని చెప్పుకుంటున్న బిజెపి తెలంగాణ రాష్ట్రంలో ఉనికే లేకుండా ఉందన్నారు. ఒకప్పుడు సిపిఐ పార్టీ 62 ఎంపీలను గెలుచుకున్న చరిత్ర ఉందన్నారు. కేంద్రంలోని ప్రధాన నరేంద్ర మోడీ  దేశ సంపదను అంబానీ ఆదానీలకు దోచిపెడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను ఆలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలను నమ్మబలికి నేడు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేని చేతగాని ప్రభుత్వమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అప్పుడే పోత్తులు తప్ప.... సిపిఐ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ప్రజల  సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు. కొత్తగూడ మున్సిపల్ కార్పొరేషన్ ను సిపి పార్టీ కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా  రాష్ట్ర నాయకులు పుస్తకాల నర్సింగ్ రావు మాట్లాడుతూ... సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేదల పక్షాన పేదల సంక్షేమం కోసం పోరాటాలు నిర్వహించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను మరిచి కాలయాపన చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న రైతుబంధు పథకాన్ని నాలుగు సార్లు ఇవ్వాల్సి ఉండగా రెండే సార్లు ఇచ్చారని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించే వరకు ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేస్తామన్నారు. రాజేంద్రనగర్ మండల కార్యదర్శి కన్యగారి నర్సింహ్మరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఏ రియాజ్  జిల్లా సమితి సభ్యులు జే ఆనంద్ గౌడ్,  కన్యగారి లక్ష్మి,  మండల సహాయ కార్యదర్శి జె విజయానంద్ గౌడ్,   మండల కార్యాలయం కార్యదర్శి జి సత్యం, మండల ఏఐటీయూసీ  అధ్యక్ష కార్యదర్శులు ఎండి సలీం సయ్యద్,  ఖాజా   మండల కౌన్సిల్ సభ్యులు సదానంద గౌడ్, మునేశ్వరి,  వాణి, మౌనిక, రామచందర్, గంగారాం, సాబేర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు  మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు 
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక...
కార్మికుల హక్కులను కాలరాసేందుకే కేంద్ర సర్కార్ లేబర్ కోడ్ తెచ్చారు.                                                                    
గుండ్లగడ్డ  కిష్ట బావి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం
భూమి సారమే భవిష్యత్తు – సేంద్రియ మార్గంలో ముందుకు నాక్రో బయోటెక్
ధ్రువపత్రాలు అందుకున్న బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు 
పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం
ప్రధాని, రాష్ట్రపతి నుంచి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు