30వార్డులో ప్రత్యర్థులకు శిరషాక్.

ఏదులాపురంలో ముగిసిన విపక్షాల కథ.. కాంగ్రెస్‌లోకి క్యూ.

30వార్డులో ప్రత్యర్థులకు శిరషాక్.

మంత్రి పొంగులేటి సమక్షంలో ‘చేయి’ కలిపిన తప్పెట్ల గిడ్జన్ (మున్నా)

 ఖమ్మం,: లోకల్ గైడ్
బీఆర్ఎస్, సిపిఐ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి 40 కుటుంబాలుశిరీషా రెడ్డి దూకుడుతో ప్రతిపక్షాలకు ముచ్చెమటలు

 ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో అప్పుడే ఫలితం తేలిపోయిందా? అంటే అవుననే అంటున్నాయి 30వ వార్డు రాజకీయ పరిణామాలు. కాంగ్రెస్ అభ్యర్థిని కొట్టం శిరీషా రెడ్డి ప్రత్యర్థులకు ఊహించని విధంగా "షాక్" ఇచ్చారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీలను ఖాళీ చేస్తూ, వార్డులో తన విజయకేతనాన్ని ఖాయం చేసుకుంటున్నారు.

శుక్రవారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం కీలక రాజకీయ మార్పుకు వేదికైంది. బీఆర్ఎస్ కీలక నేత తప్పెట్ల గిడ్జన్ (మున్నా) ఆధ్వర్యంలో బీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, సుమారు 40 కుటుంబాలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాయి. స్వయంగా మంత్రి పొంగులేటి వారికి కండువాలు కప్పి ఆహ్వానించడంతో వార్డులో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఒకేసారి 40 కుటుంబాలు పార్టీలో చేరడంతో 30వ వార్డులో విపక్షాలు డీలా పడ్డాయి. అభ్యర్థిని శిరీషా రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుండటంతో ప్రత్యర్థులకు పాలుపోని పరిస్థితి నెలకొంది. "అభివృద్ధికి ఆకర్షితులయ్యే తాము కాంగ్రెస్‌లో చేరుతున్నామని, శిరీషా రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని" ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టం శిరీషా రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.
అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పని చేస్తాను..
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 
ప్లాస్టిక్ నివారణకు జ్యూట్ బ్యాగుల ప్రోత్సాహం