పని మనిషి దొంగతనం బట్టబయలు

60 గ్రాముల బంగారం స్వాధీనం

పని మనిషి దొంగతనం బట్టబయలు

సీసీటీవీ ఆధారంగా మియాపూర్ పోలీసులు నిందితురాలి అరెస్ట్.

సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితురాలిని అరెస్ట్ చేసి దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హఫీజ్‌పేట్‌లోని ఆదిత్య ఇంపీరియల్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న శ్వేతా అక్కేనపల్లి అనే ప్రైవేట్ ఉద్యోగి 2026 ఫిబ్రవరి 14న సాయంత్రం తన ఇంట్లో ఉంచిన సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.4000 నగదు కనిపించకుండా పోయినట్టు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఇంటికి ప్రతిరోజూ శుభ్రపరిచే పనుల కోసం వచ్చే పనిమనిషిపైనే అనుమానం ఉన్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దొంగతనానికి పాల్పడిన పనిమనిషిని గుర్తించారు. అనంతరం న్యూ కాలనీ, ఓల్డ్ హఫీజ్‌పేట్ ప్రాంతంలో నివసిస్తున్న నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో ఆమె సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పనిచేసే ఇంట్లోనే బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు ఒప్పుకుంది. ఆమె వద్ద నుండి హారం, నల్లపూసల గోల్డ్ చెయిన్, బ్రాస్లెట్, చెవి రింగులు సహా మొత్తం దొంగిలించబడిన ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
ఇళ్లలో పని చేసుకునే వ్యక్తులను నియమించే ముందు వారి వివరాలను ధృవీకరించు కోవాలని, అపార్ట్మెంట్లలలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా చర్యలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మియాపూర్ పోలీసులు ప్రజలకు సూచించారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం– 152 సీసీ కెమెరాల ఏర్పాటు సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం– 152 సీసీ కెమెరాల ఏర్పాటు
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి26:ప్రజల భద్రత మరియు నేర నియంత్రణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో...
పశుపోషణలలో రైతులకు మెళకువలు ఎంతో అవసరం
పెట్రోల్ డీజిల్ కొరతతో కుదేలు కానున్న వ్యవసాయ రంగం.
కామారెడ్డి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ  డైరీ
హనుమత్ సంకల్ప మహా శోభ యాత్ర..
యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి.
బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం...