మిర్యాలగూడ మార్చి 26
(లోకల్ గైడ్ తెలంగాణ)
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ ప్రకారం యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్ డిమాండ్ చేశారు.మార్చి 26 డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికై ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లనీయకుండా మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేసి నిర్భందించడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి కై బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు.జాబ్ క్యాలెండర్ ను తక్షణమే విడుదల చేయాలన్నారు.ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్స్ వేయాలి.యువత డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి.రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలన్నారు.క్రీడా రంగం అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ మేరకు యూత్ డిక్లరేషన్ అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.లేని పక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు.అరెస్టయిన వారిలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శ్రీను,టూ టౌన్ అధ్యక్షులు వదూద్ తదితరులు ఉన్నారు.